Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

చెరుకు కొనుగోళ్లులో దళారుల దోపిడీ నిరోధించాలి: జనసేన నేతలు విజ్ఞప్తి

విశాలాంధ్ర,పార్వతీపురం: చెరకు కొనుగోళ్లలో దళారుల దోపిడీ నిరోధించాలని, రైతులకు చెరకు బకాయిలు 3కోట్ల 87లక్షలు సత్వరమే చెల్లించి ఆదుకోవాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ కు వారంతా కలిసి వినతపత్రం అందజేసారు. చెరకుమద్దతుధరను తక్షణమే ప్రకటించాలని, ఎన్ సి ఎస్ పరిసులో గతంలో ఉండే అన్ని తూనిక కేంద్రాల ద్వారా చెరుకు కొనుగోలు చేయాలని కోరారు.సకాలంలో కటింగా ఆర్డరులు ఇచ్చి, లారీలు పంపించాలని కోరారు. ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు చెరుకు కొనుగోళ్లులో దళారుల దోపిడి లేకుండా చర్యలు చేపట్టాలని, సంకిలి చెరకు అధికారులు నేరుగా రైతుల నుంచి చెరకు కోనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు . టన్నుకు మద్దతు ధర 3500రూపాయలు చెల్లింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతఐదేళ్లుగా చెరకు కొనుగోలులో దళారుల హవా పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని,
అటువంటి దళారులను దూరంచేసి నేరుగా బీమసింగి సహకార చక్కెర కర్మాగార తరహాలో ఇక్కడకూడా చెరకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరుకాలం పండించి ఎక్కువ ఖర్చు చేస్తూ పండిస్తున్న చెరకు పంట వల్ల రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారని తెలిపారు. రైతుల ఆవేదనను జిల్లా కలెక్టర్ అర్థం చేసుకున్నారని, ఈఏడాది చెరకు రైతులకు తగున్యాయం చేస్తానని, దళారుల ప్రమేయం లేకుండా కోనుగోలు కేంద్రాల ద్వారా చెరకు కోనుగోలు చేస్తానని,తక్షణమే గతంలో రైతులకు చెల్లింపు చేయాల్సిన చెరకుబకాయిలు చెళ్లింపు చేస్తానని హామీఇచ్చారని వారు తెలిపారు.ఈకార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, బంటు శిరీస్ సిరిపురపు గౌరీ శంకర్, మండల శరత్ బాబు, రాగోలు రాంబాబు, ఎస్. గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img