Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సర్వసభ్యసమావేశం నుంచి సర్పంచ్ లు బాయికట్

తూతూమంత్రంగా సర్వసభ్య సమావేశం

విశాలాంధ్ర-నల్లమాడ. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం కాస్త పూస్త మొత్తాన్ని సర్పంచ్ లు ఖాతా లో వేస్తే వాటి మొత్తాన్ని గ్రామ పంచాయతీ లో చీపురులకు, విద్యుత్ బకాయిలకే డబ్బులు చెల్లించాలిని ప్రభుత్వం ఆదేశాలు మంజూరు చేస్తే వాటికి వ్యతిరేకంగా వైసీపీ, టిడిపి సర్పంచలు ఏకమై ఆగ్రహించి సర్వసభ్య సమావేశం నుంచి ఏకగ్రీవంగా ఒక్క సారిగా బాయికట్ జరిగిన సంఘటన నల్లమాడలో చోటుచేసుకుంది.శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపి సునితాబాయి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత మాట్లాడుతున్న గానే సర్పంచ్ లు బాయికట్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లు మాట్లాడుతూ ఎన్నికల లో లక్షరూపాయలు ఖర్చు పెట్టిన గెలిసామని దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతోందని సర్పంచ్ ఖాతా లో రెండు రూపాయలు పడలేదని వారు ఆవేదన వ్యక్తపరిచారు. దీంతో అభివృద్ధి లో విఫలమైందన్నారు. అనంతరం హౌసింగ్ ఏఈ, పీఆర్ జేఈ వివిధ శాఖల అధికారులతో తూతూమంత్రంగా సమావేశం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దేవేంద్రనాయక్, ఎంపీడీఓ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సూర్య నారాయణ, ఎంపీటిసి సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img