Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఎగోటివలసలో మనఊరు- మనపోలీసు

విశాలాంధ్ర,సీతానగరం:పార్వతిపురం మన్యంజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అదేశాలు మేరకు మండలంలోని ఎగోటి వలస గ్రామపంచాయతీలో ‘ మన ఊరు మన పోలీసు’ కార్యక్రమంను గురువారం రాత్రి పార్వతీపురం డి.ఎస్పీ సుభాష్ నిర్వహించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పోలీసుశాఖ సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని డిఎస్పీ సుభాష్ చెప్పారు .యువత సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.మండలంలో నాటుసారా నియంత్రణ, పేకాట శిబిరాలుపై దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువతకు ట్రాఫిక్ నిబంధనల గురించి సైబర్ నేరాల గురించి స్త్రీలపట్ల వ్యవహరించే తీరు గురించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల గురించి వివరిస్తూ యువత తప్పుదోవ పట్టకుండా ఉండాలన్నారు . యువత సరైన లక్ష్యాలు నిర్ణయించుకొని వారికలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నారు.  నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఉన్నత ఉద్యోగాల కోసం పోలీసువారి తరఫునుంచి సరైన దిశా నిర్దేశం మరియు సహాయం చేస్తామని చెప్పారు. అన్ని గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎస్ ఐ నీలకంఠం, సర్పంచ్ , వార్డుసభ్యులు తదితరులతో పాటుగ్రామపెద్దలు , పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img