Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత అన్నదానం, ఉచిత వైద్య శిబిరంకు స్పందన

ఉచిత అన్నదానం, ఉచిత వైద్య శిబిరంకు స్పందన

- Advertisement -

శ్రీ సత్య సాయి సేవ సమితి..2
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పిఆర్టి సర్కిల్ సుబ్బదాసు భజన మందిరం ఆవరణములో శ్రీ సత్య సాయి సేవ సమితి-2 నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పుట్టపర్తి బాబా ఆశీస్సులతో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణార్జున వైద్యులచే వైద్య శిబిరాన్ని నిర్వహించి 250 మందికి ఉచిత వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగింది అన్నారు. అనంతరం శిబిరములో పాల్గొన్న వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవ సమితి-2 సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ శిబిరం పట్ల రోగులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలుత పుట్టపర్తి బాబా చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్య సాయి బాబా చేసిన సేవలను వారు కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు