Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రోడ్డున పడ్డ వారపు సంత

పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు
ప్రజా అవసరాలకు పనికిరాని ప్రభుత్వ భూములు
విశాలాంధ్ర` తనకల్లు :
దినదినాభివృద్ధి చెందుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైన కొక్కంటి క్రాస్‌ లో వారపు సంత రోడ్డున పడిరది గత సంవత్సరాలుగా ప్రజా సంఘాలు నాయకులు ఎంతోమంది వారపు సంతను ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయండి అని ఇటు అధికారులకు అటు నాయకులకు మొరపెట్టుకొన్నా లాభం లేకుండా పోతుందని సిపిఐ పార్టీ,,అనుబంధ రైతు సంఘం నాయకులు సోమవారం తనకల్లు తాసిల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం తాసిల్దార్‌ మధు నాయక్‌ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా అవసరాలకు ప్రభుత్వ స్థలాలు పనికిరాకుండా పోయాయని వాటిని ఆక్రమించుకునే వారికే అధికారులు వత్తాసు పలకడం పరిపాటిగా మారిపోయింద న్నారు రోడ్లపైనే వారపు సొంత జరుగుతుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారం క్రితం కూడా ఇద్దరు వ్యక్తులు చనిపోయి ఇంకొంతమంది క్షతగాత్రులుగా ఉన్నారని ఇలాంటి సంఘటనలకు బాధ్యత ఎవరు వహిస్తార న్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పాగా వేసినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలంలో వార సంతను ఏర్పాటు చేయాలని లేకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్‌ రెడ్డప్ప రైతు సంఘం కన్వీనర్‌ చౌడప్ప యాదవ్‌ రైతు సంఘం కార్యదర్శి ఇక్బాల్‌ సహాయ కార్యదర్శి కరీముల్లా తో పాటు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img