Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

స్జీఎఫ్ అండర్-17 సాఫ్ట్బాల్, బేస్బాల్ బాల,బాలికల జిల్లా ఎంపిక

విశాలాంధ్ర-రాప్తాడు : ఎస్కేయూ క్యాంపస్ స్కూల్లో గురువారం జిల్లాస్థాయి సాఫ్ట్బాల్ బేస్బాల్ జిల్లా జట్ల ఎంపికలను గురువారం నిర్వహించగా దాదాపు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారు ముఖ్య అతిథులుగా ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి, రెక్టార్ మల్లికార్జున రెడ్డి, రిజిస్టర్ ఎం.వి లక్ష్మయ్య, సాఫ్ట్బాల్ ఏపీ సీఈఓ సి. వెంకటేసులు, క్యాంపస్ స్కూల్ హెచ్ఎం వసుధారాణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే క్రీడలు పాఠశాల స్థాయి నుండే జరగడం వల్ల విద్యార్థులు క్రీడలలో పాల్గొని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికై మంచి క్రీడాకారులుగా ఎదిగడానికి దోహదపడుతుందన్నారు. ఈ పాఠశాల స్థాయి టోర్నమెంట్ల నుండి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగారని ఇది ఒక చక్కని వేదికని, మన భారతదేశం తరపున ఆడేలా ఎదగాలని ఆకాంక్షించారు. వెంకటేసులు మాట్లాడుతూ ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి చక్కటి అవకాశాలను పొంది మంచి ఉద్యోగ అవకాశాలు కూడా పొంద పొందడం హర్షణీయమన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాస్పూర్తితో ఆటలు ఆడాలని క్రీడాకారులందరూ స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ అనంతపురం జిల్లా కార్యదర్శి రవికుమార్, అనంతపురం జిల్లా స్కూల్ గేమ్స్ కో-ఆర్డినేటర్ నాగరాజు, ఏపీ ఎస్ఏపీఈ అనంతపురం జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగేంద్ర, పీడీలు కేశవమూర్తి, ప్రభాకర్, గోపాల్ రెడ్డి, లతాదేవి, జానకి, సమీరా, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img