Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

చెట్ల పెంపకంతో కాలుష్య నివారణ

మొక్కలు నాటుతున్న నాయకులు
విశాలాంధ్ర – ఆదోని :
చెట్ల పెంపకంతో కాలుష్యాన్ని నివారించవచ్చని వైకాపా ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్‌ జయ మనోజ్‌ రెడ్డి అన్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని ఎస్‌ కే డి కాలనీలోని మున్సిపల్‌ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా యువ నాయకుడు జయమనోజ్‌ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి తమ పరిసర ప్రాంతాలతో పాటు రోడ్లకు ఇరువైపులు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్పర్సన్‌ శాంత, వైస్‌ చైర్మన్‌ లు మహమ్మద్‌ గౌస్‌, నరసింహులు, కౌన్సిలర్లు ఫయాజ్‌అహ్మద్‌, సందీప్‌ రెడ్డి, రఘునాథ్‌ రెడ్డి, వసిం, ఉస్మాన్‌, బాలాజీ, నాయకులు చంద్ర రెడ్డి, మల్లికార్జున, అబు బక్కర్‌ సిద్దిక్‌, వైకాపా యూత్‌ పట్టణ అధ్యక్షుడు సన్నీ, శ్రీనివాస రెడ్డి, అనిల్‌, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img