Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

బోధనలో సహకారం కోసం టీచ్‌ టూల్‌ శిక్షణ

మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్ప
విశాలాంధ్ర`ఉరవకొండ :
బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించడానికి టీచ్‌ టూల్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉరవకొండ మండల విద్యాశాఖ అధికారి ఎం ఈశ్వరప్ప,మాస్టర్‌ ట్రైనర్లు డి.బాబ్జి నాయక్‌ మరియు పిఎస్పీ నాయుడు తెలిపారు. ఉరవకొండ ఎం ఆర్‌ సి భవన్‌ లో ఈనెల 12 నుంచి 21 వరకు బోధన సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు దేశాలలో తరగతి గదులలో బోధన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 7వేలు మంది ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది అన్నారు. తరగతి గది బోధనాభ్యాసంలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశం అన్నారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలు ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసం గురించి నిరంతరం పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో బొమ్మనహాలు, డి హీరేహాళ్‌, కనేకలు, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల లో ఎంపిక చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు ఎంఆర్పి లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img