Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు

పులిచింతల గేటు విరిగిన ప్రాంతంలో స్టాప్‌ లాక్‌ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.16వ నెంబరు గేటు వద్ద నిపుణుల ఆధ్వర్యంలో అధికారులు మరమ్మతులు చేపట్టారు. 35 మందితో కూడిన సిబ్బంది మరమ్మతు పనులు ప్రారంభించారు. పులిచింతల డ్యాం 16వ నెంబరు గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. కాగా పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4.45 లక్షల క్యూసెక్కులు. ఔట్‌ఫ్లో 4.33 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ముంపు ప్రభావిత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img