Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏ ఒక్క పెన్షన్ తొలగించలేదు అదనంగా ఇస్తున్నాం ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి


విశాలాంధ్ర -తనకల్లు..
ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టు ఏ లబ్ధిదారునికి ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని అదనంగా జనవరి నెల నుండి కొత్త పింఛన్లు ఇస్తున్నామని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి తెలిపారు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయావరణంలో వితంతు వృద్ధాప్య వికలాంగ డప్పు కళాకారులతోపాటు అన్ని రకాల కొత్త పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం సోమవారం ఉదయం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ముందున్న 39 లక్షల పింఛన్ల కంటే అదనంగా మొత్తం 64 లక్షల పింఛన్లు వైసీపీ ప్రభుత్వంలో అందజేస్తున్నామన్నారు జనవరి మాసం నుండి కొత్త పింఛన్లు ఇవ్వడానికి 400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుండి ఇప్పటివరకు 20వేల కోట్ల రూపాయలు ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం అందించింది అన్నారు ఈ జనవరి నెల నుండి తనకల్లు మండలానికి 280 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా కులాలకతీతంగా ఎంపిక చేసి అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఏ ఒక్కరిది పెన్షన్ తొలగించే సమస్య లేదని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దన్నారు సంక్షేమ ఫలాలతో పాటు పేదవాడి అభివృద్ధి జగన్ ప్రభుత్వ ధ్యేయమని మీ అందరి ఆశీస్సులతో పాటు దీవెనలు వైసీపీ ప్రభుత్వానికి అవసరమని 2024 లో జరిగే ఎన్నికల్లో తిరిగి వైసిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పూల నర్సింలు మేజర్ పంచాయతీ సర్పంచ్ సరస్వతి మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి కొక్కంటి శ్రీనివాసులు నాయుడు కొండా మల్లికార్జున హేమ శేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి భక్తవత్సల్ రెడ్డి చిన్నపరెడ్డి అబ్దుల్ నిజాం హిమధర రెడ్డి ప్రభాకర్ రెడ్డి రాందేశాయి పూల శీన శ్రీనివాసులు చంద్ర తోపాటు కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు6

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img