Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

పేద ప్రజల జెండా ఎర్రజెండా

విశాలాంధ్ర -ఆలూరు : కార్మిక, కర్షక, మధ్య తరగతి వర్గాల హక్కుల కోసం పోరాడేది, హక్కులను సాధించేది ఎర్రజెండా ఒక్కటే అని ఎర్రజెండా పేద ప్రజల జెండా అని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య పునర్ఘటించారు. సోమవారం మండల పరిధిలోనే పెద్దహోతూరు గ్రామంలో సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ 98 వ సంవత్సరము ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో నిరుపేదల కోసం అనేక పోరాటాలు చేసి భూమి లేని వారికి భూ పంపిణీ చేయించి, ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు, పోడు భూముల పోరాటం, పేదల కోసం పుట్టిన సిపిఐ పార్టీ వారి పక్షానే నేటికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ పేదవాడికి అండగా ఉండి కృషి చేసిందన్నారు. కూడు, గూడు, గుడ్డ పేదవానికి అందే వరకు సిపిఐ పార్టీ నిరంతరముగా పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 98 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సిపిఐ పార్టీని మనమందరం కలిసి ఉన్నత శికారాలకు తీసుకువెళ్లాలని, నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చిన్న, మాజీ మండల కార్యదర్శి గోపాల్, శాఖ కార్యదర్శి నాగరాజు, జిల్లా నాయకులు ఓతురప్ప, ఏఐటియుసి నాయకులు వన్నూర్ వలి, పరిశప్ప, మల్లప్ప, మునిస్వామి, ఉచ్చిరప్ప, రామాంజిని, ఉశేని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img