Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం అందించాలి.. సిపిఐ రైతు సంఘం డిమాండ్

రైతు భరోసా కేంద్రాల ద్వారా పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్

ఆర్డీవో రవీంద్ర బాబుకు వింత పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మిరప రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే గుర్తించి మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం అందించాలని సిపిఐ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్నిడి యలమందరావు బుధవారం నందిగామ సబ్ డివిజన్ ఆర్డిఓ రవీంద్ర బాబుకు రైతు సంఘం నాయకులు చుండూరు సుబ్బారావు నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మిరప తోటల లో వచ్చిన నల్లి వలన ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదని ఆర్థికంగా నష్టపోయి ఎటువంటి దిగుబడులు పొందలేని పరిస్థితిలో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మిర్చి తోటల వలన నష్టపోయిన రైతులను సంబంధిత శాఖ ద్వారా గుర్తించి వెంటనే రైతులకు ఎకరాకు లక్ష రూపాయల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సిపిఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు మిర్చి రైతులు లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక కింట కూడా దిగుబడి రాని పొలాలు ఎన్నో ఉన్నాయని చిన్న సన్నకారు రైతులు ఈ ఇబ్బందుల వలన నష్టాలు పాలై అప్పులు పాలై ఆత్మహత్యల దిశగా ముందుకు సాగుతున్న సందర్భాలు మనం చూస్తున్నామని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం మంచి తరుణమే అయినా గాని దాని ద్వారా రైతులకు చేకూరే లబ్ధి తక్కువగా ఉందని అన్నారు వెంటనే సంబంధిత అధికారుల ద్వారా పరిశీలించి నష్టపోయిన మిరప రైతులను ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు రైతులకు ప్రభుత్వం అండగా నిలవని ఎడల రైతులతో కలిసి మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమం హనుమంతరావు,చిన్న వీరయ్య, మల్నేటి నాగభూషణం, నాగేంద్ర ప్రసాద్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img