Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

భోగి..సంక్రాంతి శుభాకాంక్షలు.. ప్రకటన విడుదల చేసిన చంద్రబాబు

భోగి..సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.క్రాంతి అంటే అభ్యుదయం అని, సంపద పరంగా, సంస్కృతి పరంగా పురోగతిని ఆశిస్తూ వచ్చే పండుగ సంక్రాంతి అని వివరించారు. భోగి- సంక్రాంతి- కనుమ మూడు రోజుల సంక్రాంతి పండుగ తెలుగునాట పల్లెల్లో సందళ్లు, సరదాలు, జ్ఞాపకాలు పంచే అతి పెద్ద పండుగ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ తమ తమ మూలాలైన పల్లె సీమలకు తరలివచ్చి ఆత్మీయతను పంచుకునే విశిష్టమైన పండుగ అని చంద్రబాబు వెల్లడిరచారు. ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని నాడు ఆలోచించాం. అందులో భాగంగానే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తొలిసారిగా పేదలకు పండుగ కానుకలను ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికాం అని ఓ ప్రకటన విడుదల చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img