Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రావేటికరిస్తే ప్రతిఘటిస్తాం…

సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు హెచ్చరిక

విశాలాంధ్ర – మైలవరం: తెలుగు ప్రజలు రక్తమోడ్చి 32 మంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రవేటీకరిస్తే తెలుగుప్రజలు తిరగబడి ప్రతిఘటించి పరిశ్రమను పరిరక్షించుకుంటారని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు హెచ్చరించారు,
ఈ నెల 30 వ తేదీన జరుగనున్న కార్మిక గర్జనకు సంఘీభావంగా సోమవారం నుండి మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాపితముగా జరుగుచున్న దీక్షా కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గ స్థాయిలోని సీపిఐ, ఎఐటియుసి , ల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మరియు రైతుబజార్ సెంటర్ లో జరిగిన దీక్షా శిబిరానికి ఆయన ముఖ్య అధితి గా హాజరైన సిహెచ్ కోటేశ్వరరావు స్టీల్ ప్లాంట్ సాధించుకున్న విధానాన్ని , నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేస్తూ లాభాలు ఘటిస్తూ ప్రశంసలందుకుంటున్న తీరును వివరించారు, సొంత ఘనులను కూడా స్థాపించుకొని ఈ ఫ్యాక్టరీ మరింత మనుగడకు సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం దుర్భిద్ది తో ఆంధ్రులపై కక్ష పెంచుకొని ఈ ఫ్యాక్టరీ ని ప్రవేటీకరణకు పూనుకోవడం అత్యంత దారుణమని తీవ్రంగా విమర్శించారు, ఆంధ్రులు అక్రోశానికి గురి కాక మునుపే కేంద్రం ప్రవేటీకరణ నిర్ణయం మార్చుకొని ప్రభుత్వ రంగంలో నే కొనసాగించాలని డిమాండ్ చేశారు,
ఈ దీక్షలో పాల్గొన్న సీపీఐ, ఎఐటియుసి నాయకులు , కార్యకర్తలకు జిల్లా నాయకులు బుడ్డి రమేష్ ,మహిళా సమైఖ్యజిల్లా నాయకురాలు సిహెచ్ దుర్గా కోటేశ్వరరావు,లు సీపీఐ ఎరుపు రంగు కండువాలు మెడలో వేసి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు,

సీపీఐ జి కొండూరు మండల కార్యదర్శి గూడూరు శ్రీనివాసరెడ్డి ,రెడ్డిగూడెం మండల సీపీఐ కార్యదర్శి అడపా సుబ్బారావు , మైలవరంమండల సీపీఐ పార్టీ ఇంచార్జ్ బుద్దవరపు వెంకట్రావు మహిళా సమాఖ్య నాయకురాండ్రు కె రత్నకుమారి , బి బుజ్జి ,యమ్ మేరీ, మార్గరేట్ ,డి బుడ్డాయ్ , బాలస్వామి ,యస్ నాగేష్ ,ఏఐటీయూసీ నాయకులు కె సీతయ్య , రాజు, అబ్రహం,జీవన్ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img