Homeజిల్లాలుఅనంతపురంపోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ శ్రద్ధ…

పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ శ్రద్ధ…

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసు అధికారులు, సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించి, శారీరక ధారుడ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
​ఈ సందర్భంగా యోగా మాస్టర్ హెడ్ కానిస్టేబుల్ చలపతి సిబ్బంది చేత పలు రకాల యోగాసనాలు, ప్రాణాయామం చేయించి, వాటి ప్రాముఖ్యతను వివరించారు. దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, ఆర్ ఐ లు పవన్ కుమార్, మధు, ఆర్ ఎస్ ఐ లు జాఫర్, బాబ్జాన్ లతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు