Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

హైదరాబాద్‌ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఎంఎంటీఎస్‌ రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తన్నట్లు వెల్లడిరచింది. ఈ మేరకు ట్విట్టర్‌లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది. నిర్వహణ సమస్యల కారణంగా 13,14,15వ తేదీలలో రద్దు చేస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొంది. రద్దు చేసిన ఎంఎంటీఎస్‌ రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు.
లింగంపల్లి-హైదరాబాద్‌. ఫలక్‌నుమా-హైదరాబాద్‌, ఫలక్‌నుమా-లింగంపల్లి, రామచంద్రపురం-ఫలక్‌నుమా మధ్య సర్వీసులు అందించే ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశారు. లింగంపల్లి-హైదరాబాద్‌(ట్రైన్‌ నెంబర్‌ 47135), లింగంపల్లి-హైదరాబాద్‌(47137), హైదరాబాద్‌-లింగంపల్లి(47110), హైదరాబాద్‌-లింగంపల్లి(47111), హైదరాబాద్‌-లింగంపల్లి(47119), ఫలక్‌నుమా-లింగంపల్లి(47160), ఫలక్‌నుమా-లింగంపల్లి (47156), ఫలక్‌నుమా-లింగంపల్లి (47158), ఫలక్‌నుమా-లింగంపల్లి(47214), ఫలక్‌నుమా-లింగంపల్లి(47216) సర్వీసులను రద్దు చేశారు.

లింగంపల్లి-ఫలక్‌నుమా(47181), లింగంపల్లి-ఫలక్‌నుమా(47186), లింగంపల్లి-ఫలక్‌నుమా(47212), లింగంపల్లి-ఫలక్‌నుమా(47183), లింగంపల్లి-ఫలక్‌నుమా(47185), లింగంపల్లి-ఫలక్‌నుమా(47217) రైళ్లు రద్దు అయ్యాయి. అలాగే రామచంద్రపురం-ఫలక్‌నుమా(47177), ఫలక్‌నుమా-రామచంద్రపురం(47218), ఫలక్‌నుమా-హైదరాబాద్‌(47201) సర్వీసులను రద్దు చేశారు. ఈ రైళ్లన్ని మూడు రోజుల పాటు రద్దు అయ్యాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.ఎంఎంటీఎస్‌ రైళ్లలో రోజూ వేలమంది ప్రయాణిస్తూ ఉంటారు. ఉద్యోగులు, కార్మికులతో పాటు రోజువారీ కూలీలు చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువదూరం ప్రయాణించే వెసులుబాటు ఉండటం, ట్రాఫిక్‌ రద్దీ నుంచి తప్పించుకునే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌లో చాలామంది ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణం చేస్తారు. మెట్రో అందుబాటులోకి వచ్చిత తర్వాత కూడా చాలామంది ప్రయాణికులు ఎంటీఎంటీఎస్‌ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. మెట్రో నగరంలోని కొన్ని ప్రాంతాల వరకు మాత్రం అందుబాటులోకి ఉంది. దీంతో మెట్రో సౌకర్యం లేని ప్రాంతాల ప్రజలు ఎంఎంటీఎస్‌ ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు.ఇటీవల తరచూ ట్రాక్‌ మరమ్మతులు, నిర్వహణ సమస్యల వల్ల ఎంఎంటీఎస్‌ రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో రోజూ ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img