Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

వెనకబడిన తరగతుల వసతిగృహాల విద్యార్థులు ఉత్తమ పలితాలు సాధించాలి

డిఈఓ, డిబిసిడబ్ల్యుఓలు

విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యంజిల్లా పరిధిలోఉన్న వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ వసతిగృహాల్లో 10వతరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తమ పలితాలు సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టరు రమణ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎస్ కృష్ణలు పిలుపు నిచ్చారు. పదోతరగతిలో వివిధ మాధ్యమాలకు సంబంధించి పార్వతీపురం ప్రభుత్వ బ్రాంచ్ స్కూల్ ఉపాధ్యాయులతో విద్యార్థులకు పలుసూచనలు గణితశాస్త్రంలో మెలకువలు సంబంధించిన శిక్షణతరగతులు విద్యార్థులకు నిర్వహించారు.పార్వతీపురం సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి ఎన్. సాంబమూర్తి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి విధ్యార్ధులతో బిసి వెల్ఫేర్ అధికారులు మాట్లాడుతూ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని, జిల్లాకు, విద్యార్థులు తల్లిదండ్రులకు, మంచి పేరు తేవాలని ఉన్నత స్థాయికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే వసతిగృహాల్లో 10వతరగతి విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాల అనంతరం వసతిగృహాల్లో ప్రత్యేక తరగతులను వసతిగృహాల సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లాపరిధిలో ఉన్న వసతిగృహాల వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img