Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతుల ధాన్యంను తక్షణమే కొనుగోలు చేయాలి

. రైతుకూలీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం
. కొనుగోలు చేయకపోతే 25నుండి నిరసన కార్యక్రమాలు చేస్తాం:

ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు
జిల్లాలో పేరుకుపోయిన రైతుల ధాన్యంను తక్షణమే కొనుగోలు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మన్యంజిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.గురువారం
జిల్లా రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్థానిక ఎన్జీవో హోంలో జిల్లా రైతు సంఘం ప్రధానకార్యదర్శి బుడితి అప్పల నాయుడు ఆద్వర్యంలో నిర్వహించారు. రాజకీయపార్టీలు, రైతుకూలీ సంఘాల నాయకులు రైతుల వద్ద ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కాకుంటే ఈనెల 25 న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించేందుకు తీర్మానం చేశారు. తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఫిబ్రవరి నెల గడుస్తున్నప్పటికీ రైతుల వద్ద ధాన్యం సేకరణ చేయక పోవడం పాలక పక్ష వైఫల్యానికి నిదర్శమని తక్షణమే రైతుల వద్ద ఉన్న ధాన్యం సేకరణ చేసి రైతుల ఆదుకోకపోతే రాజకీయాలకు అతీతంగా రైతు పక్షాన జిల్లా ఉద్యమానికి సిద్ధమని జిల్లాలో రైతుల పండించిన పంట పండగ ముందు నుంచే బస్తాలలోకి ఎత్తి రైతులు కల్లాల్లో నెట్టి కట్టి ఉంచడం వలన ఒకవైపు ఎలుకలు, పందుల బెడదతో పాటు అప్పుడప్పుడు రైతు ధాన్యం దొంగల పాలవుతుండగా కాపలా ఉంటున్న రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఈ మధ్యకాలంలో ఏనుగులు రైతులను చంపేస్తున్నా ప్రభుత్వానికి కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే రైతు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల కోసం ఎటువంటి ఉద్యమం చేపట్టిన మద్దతు ఉంటుందని తెలిపారు. అరకు పార్లమెంట్ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు, పార్వతీపురం మాజీ ఎంపిపి గొట్టాపు వెంకటనాయుడులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న వారు ధాన్యం సేకరణ చేయకపోవడం రోడ్డున పడుతున్న రైతుల ఆవేదనకు సమాధానం చెప్పాలని నిలదీశారు. రైతు కూలీ సంఘం (ఆ.ప్ర) రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శ్రీను నాయుడు మాట్లాడుతూ రైతు కలలో బస్తాలతో ధాన్యం మంచులో తడిసి ఎండకు గురై తరుగుతో పాటు బస్తాలు పాడై పోతున్నాయని ధాన్యం రద్దవుతున్నాయని, ధాన్యం తరుగుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కనుక ఐక్య ఉద్యమం ద్వారా రైతులకు అండగా నిలబడదామని పిలుపు నిచ్చారు. జనసేన పార్టీ నాయకులు వంగల దాలినాయుడు మాట్లాడుతూ రైతుల కోసం చేసే ఉద్యమంలో మేము భాగస్వామ్యం అతామని రైతుకి అండగా ఉంటామని తెలిపారు. అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి. సంగం మాట్లాడుతూ గత నెలా పది రోజుల నుండి ధాన్యం కొనండి మహా ప్రభో అని ప్రభుత్వాన్ని రైతులు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం రైతుల చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆందోళనలో భాగస్వాములమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు వెలమల సత్యనారాయణ, రైతు కూలీ సంఘం ఆ ప్ర జిల్లా కార్యదర్శి భాస్కరరావు, విశ్వేశ్వరరావు, బెజ్జిపురపు వెంకటరమణ, రైతులు కనపాకచౌదరి, నాయుడు,చిన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img