Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

చైనాకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: అమెరికా అధ్యక్షుడు

బెలూన్‌ కూల్చివేతపై స్పందించిన జో బైడెన్‌
త్వరలో చైనా అధ్యక్షుడితో మాట్లాడే అవకాశం ఉందని వెల్లడి
బెలూన్‌ కూల్చివేసిన ఘటనపై చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశమే తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా స్పష్టం చేశారు. అయితే.. త్వరలో తాను చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌తో మాట్లాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్‌ను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేసిన విషయం తెలిసిందే. ఆ బెలూన్‌ నిఘా కోసం ఉద్దేశించినదని అమెరికా ఆరోపించగా ఈ ఆరోపణను చైనా తోసిపుచ్చింది. అది వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగించిన బెలూన్‌ అని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది.‘‘త్వరలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో నేను మాట్లాడొచ్చు. మేం ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవట్లేదు. అయితే..బెలూన్‌ కూల్చివేత ఘటనపై క్షమాపణలు చెప్పే ఉద్దేశమే నాకు లేదు. అమెరికా ప్రజల భద్రత, ప్రయోజనాలకే మా తొలి ప్రాధాన్యం’’ అని జో బైడెన్‌ స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటివరకూ అమెరికా తన గగనతలంలో మొత్తం నాలుగు గుర్తుతెలియని వస్తువులను కూల్చేసింది. వాటిలో ఒకటి చైనా బెలూన్‌ కాగా.. మిగతా మూడిరటి విషయంలో అమెరికా సైన్యం పూర్తి వివరాలు వెల్లడిరచాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img