Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

చెక్కభజన బృందాన్ని అభినందించిన సర్పంచ్ రామాంజనేయులు

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మండలం రేణిమకులపల్లి గ్రామానికి చెందిన సుంకులమ్మ తల్లి చెక్కభజన బృందం చెక్కభజన పోటీలలో జిల్లాలోని మొదటి బహుమతి సాధించడంతో ఆ బృందాన్ని గ్రామ సర్పంచ్ బోయ రామాంజనేయులు సోమవారం అభినందించారు. ఈనెల 18వ తేదీన మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని పెద్దవడుగూరు మండలం చిన్న ఒడుగూరు గ్రామంలో జిల్లాస్థాయి చెక్కభజన పోటీలను నిర్వహించారు . ఈ పోటీలలో రేణిమాకులపల్లి గ్రామానికి చెందిన చెక్కభజన బృందం ప్రేక్షకులను, భక్తులను ఆకట్టుకోవడంతో నిర్వాహకులు మొదటి బహుమతిగా ఎంపిక చేసి రూ.25 వేల నగదును బృందం యొక్క సభ్యులకు అందజేశారు. చెక్కభజన బృందం ప్రతిభ కనపరిచి మొదటి స్థానం సాధించడానికి కృషి చేసిన బృందం యొక్క గురువు టి రాము, సహాయ గురు ధనంజయలను కూడా గ్రామ సర్పంచ్ రామాంజనేయులు తో పాటు గ్రామస్తులందరూ కూడా అభినందించారు. తమ గ్రామం యొక్క చెక్కభజన బృందం భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రస్థాయి బహుమతులు పొందాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img