Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

బాల్య వివాహాలతో అనర్ధాలు

విశాలాంధ్ర -బొమ్మనహళ్ : మాతా శిశు మరణాలు తగ్గాలంటే బాల్యవివాహాలను నిర్మూలించాలని వైద్యాధికారి గీత భార్గవి అన్నారు శుక్రవారం మండలంలోని లింగదహాల్ గ్రామంలో వైద్యాధికారి గీత భార్గవి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అంతర్జాతీయ మహిళా దినో త్సవం వారోక్ష వాలు సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు సమాజానికి ఆడపిల్ల యొక్క అవసరం పై అవగాహన కల్పించారు .డాక్టర్ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల ప్రసవం సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు ప్రధా నోపద్యాయులు మాట్లాడుతూ పోక్సో చట్టం, దిశ చట్టం, ఉపయోగించుకొని మహిళలు రక్షణ పొందాలని, బాల్య వివాహాలు చేయరాదని, లింగనిర్ధారణ చేయరాదని ,ఇందిరా గాంధీ, సరోజినినాయుడు ,సుష్మాస్వరాజ్ లాంటి ఉన్నత స్థాయి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నాగరాజు,ఉపాధ్యాయులు,స్వప్న,శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ భారతి హెల్త్ సూపర్వైజర్ ఉమాదేవి, ఆరోగ్య కార్యకర్త వెంకట రమణ,Aచీవీ ఎ ర్రమ్మ ,ఆశ గంగమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img