Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మెగా ఉచిత వైద్య శిబిరానికి స్పందన

150 మంది ఆపరేషన్లకు ఎంపిక

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మండల కేంద్రంలోని శ్రీ వాణి విద్యా నికేతన్ పాఠశాలలో దివంగత మాజీ ఎమ్మెల్యే వశికేరి గోపీనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం  శాంతారామ్ ఆసుపత్రి వారి సౌజన్యంతో  నిర్వహించిన  ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరాన్ని  ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రస్ట్ చైర్మన్ వసకేరి రమేష్ బాబు, వైస్ చైర్మన్, వసికేరి మల్లికార్జున వజ్రకరూరు జడ్పిటిసి సభ్యులు తేజేశ్వరి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం హర్షనీయమని  పేదలకు సేవలు చేసే ఇలాంటి కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు మాట్లాడుతూ  ఈ వైద్య శిబిరంలో  గుండె, కంటి ఆపరేషన్లు మరియు మోకాలు, భుజము, మెడకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు  తెలిపారు. కంటి మరియు గుండెకి సంబంధించి 150 మందికి ఆపరేషన్లు అవసరం కావడంతో వారిని వెంటనే శాంతారామ్ హాస్పిటల్ కు పంపినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి దాదాపు 1000 మంది ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు వారు తెలిపారు.  వైద్య శిబిరానికి వచ్చిన అందరికీ ఉచితంగా పరీక్షలు, మందులు కూడా అందివ్వడం జరిగిందని భోజన సౌకర్యాలు కూడా కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, వైసీపీ పట్టణ కన్వీనర్ సి. ఓబులేసు ఎంపీపీ, వైస్ ఎంపీపీ నరసింహులు ఉరవకొండ ఉప సర్పంచ్ వన్నప్ప, కురుబ సంఘం నాయకులు వసకేరి లింగమూర్తి, శివప్రసాద్, వాణి విద్యా నికేతన్ కరస్పాండెంట్ రఘు రాములు, శ్రీలక్ష్మి, ట్రస్ట్ ట్రెజరర్ మహేష్, టౌన్ బ్యాంక్ అధ్యక్షులు సాదు కుళాయి స్వామి, ఉపాధ్యక్షులు మహేష్ మండలంలోని ఎంపీటీసీ, సభ్యులు వార్డు సభ్యులు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు వైద్య సిబ్బంది  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి మరియు శాంతారామ్ ఆసుపత్రి వైద్య సిబ్బందికి ట్రస్ట్ నిర్వాహకులు వసికేరి రమేష్ బాబు, మల్లికార్జున, మహేష్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img