Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఘనంగా మహిళ దినోత్సవం

విశాలాంధ్ర..ఉరవకొండ..అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం నాయకులు వన్నూరమ్మ, నూర్జహాన్ మాట్లాడుతూ సమాజంలో పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు కల్పించాలని చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు మహిళల హక్కులు సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. అనంతరం వారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు అరుణ,నాగవేణి లక్ష్మి, సాకమ్మ ,హంపక్క తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img