Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రక్తహీనత నిర్మూలనకు నులిపురుగుల నివారణ ఎంతో అవసరం

జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : చిన్నారుల్లో తరచుగా సంభవించే రక్తహీనత నిర్మూలనకు నులి పురుగుల నివారణ ఎంతో అవసరమని, ఇందుకోసం ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. నులిపురుగుల నిర్మూలన కార్యక్రమ గోడ పత్రికలను కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది పైన వయసున్న పిల్లలందరికీ మరియు ఒక సంవత్సరం నుండి 2 సంవత్సరాల వయస్సు గలిగిన పిల్లలకు అర మాత్రని ఒక గ్లాసు మంచి నీటిలో కరిగించి త్రాగించాలన్నారు. అలాగే 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు భోజనం పూర్తి అయిన అరగంట తరువాత పూర్తి మాత్రను అందించి మాత్ర చప్పరించేలా తెలపాలన్నారు. జ్వరము, జలుబు అనారోగ్యం సమస్యలు ఉన్నట్లైతే వాటి నుంచి ఉపశమనం పొందిన తరువాత ఆల్బెండజోల్ మాత్ర చప్పరించాలన్నారు, చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపం, బలహీనత, కడుపు – నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు నులిపురుగుల ద్వారా వస్తాయని అన్నారు. అందుకే ప్రభుత్వం నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు అందజేస్తోందన్నారు. మార్చి 10 న మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మున్సిపాలిటీ కమీషనర్ / ఎంపీడీఓ ల పరిదిలో గల వైద్యాధికారులు సమన్వయ శాఖ లైన అంగన్వాడీలు, పాఠశాలలు, కాలేజీల్లో ఈ నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నారని సూచించారు. బయట ఉన్న పిల్లలను కూడా గుర్తించి వారికి మాత్రలు పంపిణీ చేసి, మింగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వీరబ్బాయి,జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.యుగంధర్, రాష్ట్రీయ బాల స్వాత్య కార్యక్రమ అధికారి. డా.జి.నారాయణస్వామి,డా. వి. సుజాత, డీపీఎం ఒ డా. చెన్నకేశవులు, డి సి హెచ్ ఎస్ . డా. క్రిష్ణవేణి డి ఈ ఐ సి ,సీఈఓ బాస్కర్ రెడ్డి, డి .సి .ఒ సాయిరాం, పీడీ ఐసీడీస్ శ్రీదేవి, జిల్లా రెసిడెన్సియల్ మరియు జిల్లా హాస్టల్స్ అధికారులు, భాగ్యలక్ష్మి , సిపి ఒ ప్రేమ్ చంద్ర, మేనేజర్ రజిత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img