అక్టోబర్ నెల తిరుపతిలో నిర్వహించినటువంటి 70వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి జూడో పోటీలు
విశాలాంధ్ర ధర్మవరం:: 70వ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలలో ధర్మవరం జీ.వి.ఈ జెడ్పి.జి.హెచ్.ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి వి.సింధు మైనస్ 32 కేజీ అండర్ 14 విభాగంలో పాల్గొని రాష్ట్రస్థాయి జూడో పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది అని కరాటే, జూడో యెన్ ఎస్ ఎన్ ఐ ఎస్ కోచ్ మాస్టర్ ఇనాయత్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అలానే 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపిక అవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇనయత్ భాషా తో పాటు పీ.డీ స్వరూప మెడల్ ప్రధానం చేశారు. అలానే జాతీయ స్థాయిలో కూడా పాల్గొని మన మన రాష్ట్రానికి మన ఊరికి మన స్కూల్ కి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, మా వంతు క్రీడల పట్ల పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హెచ్.ఎం ప్రధానోపాధ్యాయురాలు సుమన, ఉపాధ్యాయ బృందం క్రీడలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
రాష్ట్రస్థాయి జూడో పోటీలలో సింధుకు గోల్డ్ మెడల్
- Advertisement -
RELATED ARTICLES


