Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మైన్మార్‌లో మారణహోమం

ముగ్గురు బౌద్ధసన్యాసులతో సహా 22 మంది కాల్చివేత
నేపైడావ్‌: మైన్మార్‌లోని ఓ బౌద్ధ మఠంలో మారణహోమం జరిగింది. ముగ్గురు బౌద్ధ సన్యాసులతో పహా 22 మంది కాల్చివేతకు గురయ్యారు. తిరుగుబాటు అనంతరం ఆ దేశంలో సైన్యం రెచ్చిపోతూ పౌరహత్యలకు పాల్పడుతున్న క్రమంలోనే ఇది జరిగిందని తెలుస్తోంది. అయితే మైన్మార్‌ జుంటా అధికార ప్రతినిధి జా మిన్‌ టున్‌ స్పందిస్తూ ఇది ఉగ్రసంఘాల పని అని చెప్పారు. ‘కరేన్ని నేషలైట్స్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (కేఎన్‌డీఎఫ్‌), మరో రెబల్‌ గ్రూపు… నాన్‌ నైట్‌ గ్రామంలోకి ప్రవేశించాయి. స్థానిక ప్రజలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వ దళాలు వెళ్లిన తర్వాత ఉగ్రదళాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో హింస జరిగింది. కొందరు గ్రామస్తులు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు’ అని అన్నారు. ఈ ఘటన గతవారంలో జరిగింది. మృతదేహాలన్నీ నాన్‌నైన్‌ మఠం ఆవరణలో లభించడం వల్ల ఇది మారణహోమేనని స్థానిక మీడియా పేర్కొంది. మృతుల పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడి ప్రకారం చాలా దగ్గర నుంచి ఆటోమేటిక్‌ ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు తేలింది. కాగా రెండు వారాలుగా అక్కడ పోరు సాగుతోంది. ఇప్పటివరకు 100కుపైగా కట్టడాలకు నిప్పుపెట్టి దగ్ధం చేశారని మీడియా నివేదికలు తెలిపాయి. సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత సైన్యం అధీనంలోకి మైన్మార్‌ వెళ్లిపోగా 2021 ఫిబ్రవరి నుంచి సంక్షోభ పరిస్థితి కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img