Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

నేడు దిల్లీలో కిసాన్‌ మహాపంచాయత్‌

చేరుకున్న లక్షలాది మంది రైతులు
ఎంఎస్పీకి చట్టబద్ధతే లక్ష్యం: ఎస్‌కేఎం

న్యూదిల్లీ : వివాదాస్పద సాగు చట్టాల రద్దు కోసం ఉక్కు సంకల్పంతో ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా ఏడాదిరన్నర పాటు దిల్లీలో రైతాంగ ఉద్యమాన్ని నడిపించిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) మరోమారు తమ డిమాండ్ల పరిష్కారానికి నడుంబిగించింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేసేదెప్పుడని పాలకులను నిలదీసేందుకు సిద్ధమైంది. ఇదే క్రమంలో కిసాన్‌ మహాపంచాయత్‌కు పిలుపునిచ్చింది. సోమవారం దిల్లీలో జరగబోయే మహా పంచాయత్‌లో లక్షలాది మంది రైతులు పాల్గోనున్నట్లు ఎస్‌కేఎం ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి రైతులు తరలివచ్చారని తెలిపింది. కసీన మద్దతు ధరల (ఎంఎస్పీ)కి

చట్టబద్ధ హామీ కోసం ఒత్తిడి తెచ్చేందుకు కిసాన్‌ మహాపంచాయత్‌ జరుగుతుతోందని తెలిపింది. ‘జేపీసీకి సిఫార్సు చేసిన విద్యుత్‌ సరవణ బిల్లు`2022ను ఉపసంహరించుకోవాలి.
ఎస్‌కేఎంతో చర్చించిన తర్వాతే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్రం రాతపూర్వకంగా హామీనిచ్చిందిగానీ అలా జరగకుండానే బిల్లును ప్రవేశపెట్టింది’ అని ఎస్‌కేఎం ప్రకటన పేర్కొంది. వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్‌తో పాటు గ్రామీణ ఇళ్లకు 300 యూనిట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ను సంయుక్త కిసాన్‌ మోర్చా పునరుద్ఘాటించింది. ఎస్‌కేఎం నేత దర్శన్‌ పాల్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘2021, డిసెంబరు 9న కేంద్రం మాకు రాతపూర్వకంగా కొన్ని హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటివరకు అనేకం అమలుకు నోచుకోలేదు. రైతులు ఎదుర్కొనే సంక్షోభాన్ని పరిష్కరించేందుకూ పటిష్ఠచర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది’ అని అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీల అమలునకు, పెండిరగ్‌ డిమాండ్ల పరిష్కారానికి అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమన్నారు. ఎంఎస్‌పీపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని, అది రైతుల డిమాండ్లకు అనుకూలంగా లేదని ఎస్‌కేఎం కోరిన విషయం విదితమే.
పింఛన్‌, రుణమాఫీ, రైతాంగ ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం, విద్యుత్‌ బిల్లు ఉపసంహరణ తదితర డిమాండ్లు ఉన్నాయి. ఇదిలావుంటే, మహాపంచాయత్‌ కోసం దిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.20 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. రాంలీలా మైదానానికి రైతులు భారీగా చేరుకోనున్నట్లు భావిస్తున్న క్రమంలో ఆ మేరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులను సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img