Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

జగనన్న గృహనిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలి

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని జగనన్న లే అవుట్ లలో నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇళ్లను ప్రారంభం చేయకపోతే ఇచ్చిన ఇంటి పట్టాలను రద్దుచేస్తామని ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్ తెలిపారు.శనివారం ఆయన అప్పయ్యపేట గ్రామంలోని జగనన్న లే అవుట్ వద్దకు వెళ్ళి లబ్దిదారులతో మాట్లాడారు. త్వరితగతిన నిర్మాణాలు జరిగేల లబ్దిదారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఆయనతో పాటు హౌసింగ్ ఏఈ జానకీరాం, వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎంపీటీసీ బురిడి సూర్యనారాయణ, ఈఓ వెంకటరావు, సెక్రటరీ సుధారాణి, ఇంజనీరింగు సహాయకులు సంతోష్ లబ్దిదారులు పాల్గొన్నారు.
కార్యదర్శులతో సమావేశం:
ఎంపిడిఓగా భాధ్యతలు తీసుకున్న ప్రసాద్ వెంటనే పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.గ్రామాల్లో పారిశుధ్యం తొలగింపు,వీదిలైట్లు ఏర్పాటు, త్రాగు నీరుసౌకర్యం, ఇంటిపన్నులు వసూలు, హరితరాయబారుల వేతనాలచెల్లింపు, చెత్త సంపద కేంద్రాల పనితీరు,సచివాలయంలో సిబ్బంది హాజరు, వాలంటీర్ల పర్యవేక్షణ తదితర అంశాలను ఎంపిడిఒ చర్చించారు. అటు ప్రజలకు ప్రజా ప్రతినిదులకు,ఇటు అధికారులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. దీంతోపాటు ఆదివారం స్తానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరగనున్న ఆసరా కార్యక్రమాన్ని విజయవంతం కావడంలో కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఆయనతో పాటు ఈఓపిఆర్డీ కె కె కె వర్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img