Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

రోడ్డు మరమ్మతులు చేపట్టాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : కోసిగి, ఎమ్మిగనూరు రహదారులు మరమ్మతులు చేపట్టాలంటూ గురువారం సిపిఐ ఆధ్వర్యంలో మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామం నుండి నాల్గవ మైలు వరకు సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ అధ్యక్షతన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యన్న, మంత్రాలయం మండల కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, ఏఐకెఎస్ తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ రహదారుల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని ఆరోపించారు. రహదారుల కోసం ప్రభుత్వం 20 కోట్లు విడుదల చేసి నాలుగు నెలలు కావస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. రోడ్లు గుంతలమయంగా మారడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని భూటకపు మాటలు చెపుతున్నారన్నారు. రోడ్లు, ఇళ్లు, రాజధాని నిర్మాణంలో అపద్ధాలు చెప్పి, నిధులన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పి ఇంటికి పంపించే సమయం దగ్గరలోనే ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే కోసిగి నుంచి ఎమ్మిగనూరు వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లేనిపక్షంలో వామపక్షాలుగా ప్రజా సమస్యలు తీర్చేవరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, హనుమంతు, గిడ్డయ్య, రామాంజనేయులు, నాగరాజు, వీరేష్, హుస్సేన్, రైతు సంఘం సీనియర్ నాయకులు మాబుసాబ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img