Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత పాలిసెట్ కోచింగ్

ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 17వ తేదీ నుండి మే 9 వ తేదీ వరకు ఉచిత పాలిసెట్ కోచింగ్ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ ఈ పాలీసెట్ కోచింగ్ కు పదవ తరగతి రాస్తున్న విద్యార్థులు లేదా పదవ తరగతి పాసైన విద్యార్థులు అర్హులని తెలిపారు. కోచింగ్ తరగతులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కోచింగ్ కు ఎటువంటి రుసుము లేదని పూర్తిగా ఉచితమని తెలిపారు. పాలీసెట్ కోచింగ్ లో పాల్గొనేవారు హాల్ టికెట్ కానీ పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కానీ ఉండాలన్నారు. శిక్షణ తరగతుల సమయంలో వివిధ రకాల పరీక్షలను నిర్వహించి మంచి ఉత్తీర్ణతతో పాలీసెట్ లో సీటు సంపాదించేందుకు అధ్యాపకుల కృషి ఉంటుందని వారు తెలిపారు. పాలిసెట్ పరీక్ష మే 10వ తేదీన నిర్వహించబడుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img