Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సికింద్రాబాద్‌- తిరుపతి వందే భారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి

సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య నడిచే వందే భారత్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లోని పదో నెంబర్‌ ప్లాట్‌ ఫాం నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పచ్చ జెండా ఊపి రైలు ను ప్రారంభించారు. రూ.720 కోట్లతో చేపట్టే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృధ్ది పనులకు మోడీ శంకూస్థాపన చేశారు. అనంతరం పరేడ్‌ మైదానంలో జరిగిన కార్యక్రమంలో మేడ్చల్‌ – ఉందానగర్‌ ఎంఎంటిఎస్‌ రైళ్ల ప్రారంభంతోపాటు పలు రైలు, రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ కి గవర్నర్‌ తమిళసై, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, అశ్విని వైష్ణవ్‌, తెలంగాణ మంత్రి తలసాని, ఎంపి లు బండి సంజయ్, లక్ష్మణ్‌, ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌, తదితరులు స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img