Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

‘మా నమ్మకం నువ్వే జగన్‌’

ఉప సర్పంచ్ వన్నప్ప

విశాలాంధ్ర – ఉరవకొండ : ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాన్ని శనివారం ఉరవకొండ పట్టణంలోని ఒకటవ సచివాలయం పరిధిలోని తలారి వీధిలో  ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ వన్నప్ప  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విడపనకల్లు మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, ఉరవకొండ వైసిపి పార్టీ  పట్టణ కన్వీనర్ ఓబులేసు, ముండాస్ ఓబులేసు పాల్గొన్నారు. సందర్భంగా వీరు  ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని  రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన  స్టిక్కర్లు మరియు కిట్లను పంపిణీ చేశారు. జగనన్నే మా భవిష్యత్’ అనే నినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు . గత  ప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని  వారు  కోరారు. నవరత్నాలు పథకాలు ద్వారా అర్హులైన పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. ప్రజలందరూ కూడా  జగన్ ఆశీర్వదించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మరియు గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు శర్మాస్, అనిల్ వన్నూరు స్వామి, లోకేశ్వరి, వాణి సంధ్య, భారతి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img