Friday, May 3, 2024
Friday, May 3, 2024

పట్టణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలి

సీపీఐ నియోజికవర్గం కార్యదర్శి వీరభధ్రస్వామి…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ చేపట్టిన రిలే దీక్షలు 4వ రోజు చేరాయి.. ఈ దీక్షలకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి, పట్టణ కార్యదర్శి గోపినాథ్,సీపీఐ మండల కార్యదర్శి రాము,ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, రాయలసీమ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రజా సేవా సంఘం నాయకులు ఆలం బాషా, మహేంద్ర నాయకులు కార్యకర్తలు శిబిరం దగ్గరికి వచ్చి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వీరభధ్రస్వామి మాట్లాడుతూ.. న్యాయమైన సమస్యలు పరిష్కరించి ప్రజలకు మేలు చేయండి అని కోరారు. సిపిఎం పార్టీ వారు దీక్షలు చేపట్టి 4వ రోజులు అవుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరుగైన వైద్యం లేక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలు అవుతున్న పేదలని మధ్యతరగతి వారిని ఆదుకోండి అని అడుగుతా ఉంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని నాయకులు అధికారులను ప్రజా ప్రతినిధులను ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో పేదలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యమందడం లేదు అటువంటిప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ ఎందుకని ప్రశ్నించారు వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించి శాస్త్ర చికిత్సలు చేపట్టి పేదలను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ దీక్ష లో ఐద్వా మహిళా సంఘం పట్టణ కార్యదర్శి బి.రంగమ్మ , లక్ష్మీబాయి,కుమ్మరి ,లక్ష్మీదేవి ,లలిత ఆదిలక్ష్మి ,రేణుక, కీర్తి ,ఉష రాణి కుర్చున్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు,దాసరి శ్రీనివాసులు,రాము నాయక్ ,మారుతి ప్రసాద్ ,ఏఐఎస్ఎస్ నియోజికవర్గం కార్యదర్శి వెంకట్ ,ఏఐఎస్ ఎఫ్ నియోజికవర్గం ఆర్గనేజింగ్ కార్యదర్శి వినోద్ ,ఏఐవైఎఫ్ నాయకులు వంశికిృష్ణ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img