Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దళితులపై దాడులకు నిరసనగా రేపు చలో విజయవాడ

జయప్రదానికి రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై జరుగు తున్న దాడులు, అకృత్యాలను నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం ఒక ప్రక టనలో పిలుపునిచ్చారు. దళితులు, మైనార్టీలపై దాడులు, అకృత్యాలు నానాటికీ పెరిగిపోతు న్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో మాస్కులు లేవన్న పాపానికి డాక్టర్‌ సుధాకర్‌ను వైసీపీ ప్రభుత్వం మానసికంగా, శారీరకంగా వేధింపు లకు గురిచేసిందన్నారు. నడిరోడ్డుపై డాక్టర్‌ సుధాకర్‌ పెడరెక్కలు విరిచికట్టి అవమాన పరచిన ఘటన అమానుషమని, ప్రభుత్వ వేధింపులు తాళలేక డాక్టర్‌ సుధాకర్‌ మరణిం చారని పేర్కొన్నారు. దళిత డ్రైవర్‌ సుబ్రహ్మ ణ్యాన్ని అమానుషంగా హత్యచేసి, డోర్‌ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ బెయిల్‌పై విడుదలవ్వగా ఘనంగా స్వాగత సత్కా రాలు ఏర్పాటు చేయడం ఆ పార్టీకి సిగ్గు చేటన్నారు. ఇటీవల కడప జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ దళిత డాక్టర్‌ అచ్చన్నను కిడ్నాప్‌చేసి హత్యచేసిన ఘటన దుర్మార్గమ న్నారు. మైనారిటీలపై, మహిళలపై దాడులు, అకృత్యాలు జరుగుతున్నా సీఎం జగన్‌కు చీమ కుట్టినట్టయినా లేదని, కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామంలో హాజీర అనే 22 ఏళ్ల యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారయత్నం చేసి, చంపడం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో షేక్‌ షాహిదా అనే దూదేకుల కుటుంబానికి చెందిన 23 ఏళ్ల యువతిని మానభంగం చేసి హత్య చేయడం తగదన్నారు. నంద్యాలలో ఆటోడ్రైవర్‌ అబ్దుల్‌ సలాంపై దొంగతనం కేసు మోపి ఆయన ఇద్దరు పిల్లలు, భార్యతోసహా మొత్తం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేలా చేసినటువంటి ఘటనలు అనేకమున్నాయని వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక దాదాపు కేవలం ముస్లిం మైనార్టీలపైనే 100కుపైగా దుశ్చర్యలు సాగడం విచాకరమని, అరాచకాలను అరికట్టాల్సిన జగన్‌ సర్కార్‌ నిందితులకు కొమ్ముకాసే విధంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. దళితులు, మైనార్టీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 4వ తేదీన విజయవాడలో సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో దళిత, మైనార్టీ, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించినట్లు గుర్తుచేశారు. దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాలని ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. దళిత, మైనారిటీ, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఈ నెల 11న చేపట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాల్సిందిగా దళితులకు, ముస్లిం మైనార్టీలకు ప్రజాతంత్ర వాదులందరికీ రామకృష్ణ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img