Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దేశంలో ఫ‌స్ట్ ర్యాపిడ్ రైలు

ఢిల్లీ..ఘ‌జియాబాద్..మీర‌ట్ మార్గంలో ప‌రుగులు పెట్ట‌నుంది సెమీ హై స్పీడ్ రైలు..కాగా దేశంలో మొట్టమొదటి ర్యాపిడ్ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మార్గంలోని 82-కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ లో సేవలు అందించనుంది. దీనికి రాపిడిక్స్ అని పేరు పెట్టినట్లు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ప్రకటించింది. పట్టణ మెట్రో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న ఎన్సీఆర్టీసీ రాపిడిక్స్ ద్వారా దేశంలో మొదటి సెమీ-హైస్పీడ్ ప్రాంతీయ రైలు సేవలకు శ్రీకారం చుట్టనుంది. వేగంతోపాటు అధునాతన సాంకేతికతతో నడిచే రాపిడిక్స్ రైలుతో ప్రయాణ సమయం తగ్గనుంది. 2025 నాటికి ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఎన్సీఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ముందు ఈ ఏడాదిలో సాహిబాబాద్ఉదుహై మధ్య 17 కిమీ పొడవైన ప్రాధాన్యతా విభాగంలో నడపాలని చూస్తోంది. ఈ రైలు కోసం మీరట్‌లో ప్రత్యేకంగా 8స్టేషన్‌లు నిర్మించనుందట‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img