Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అవినాశ్ రెడ్డికి సాయంత్రం 5 గంటల వరకు టైమ్ ఇచ్చిన సీబీఐ

హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన అవినాశ్ రెడ్డి..విచారణను 3.45కి వాయిదా వేసిన హైకోర్టు
ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సునీత


మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సాయంత్రం 5 గంటల తర్వాత విచారణకు రావాలని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ తెలిపింది. తెలంగాణ హైకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు ఈరోజు మినహాయింపును ఇవ్వాలని సీబీఐను అవినాశ్ తరపు లాయర్లు కోరారు. అయితే వారి విన్నపాన్ని సీబీఐ తిరస్కరించింది. సాయంత్రం 5 తర్వాత విచారణకు రావాలని ఆవేశించింది.

మరవైపు, బెయిల్ పిటిషన్ పై వాదనలను మధ్యాహ్నం 3.45కి హైకోర్టు వాయిదా వేసింది. అంతకు ముందు బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఈ నెల 30లోగా విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని… విచారణకు ఎప్పుడు పిలిచినా పిటిషన్లు వేస్తున్నారని సీబీఐ తరపు లాయర్లు వాదించారు. బెయిల్ పై హైకోర్టు నిర్ణయం తర్వాత సీబీఐ విచారణకు అవినాశ్ హాజరవుతారని ఆయన తరపు లాయర్లు చెప్పారు. మరోవైపు వివేకా కుమార్తె సునీత కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img