Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అరటి పంట నష్టపోయిన రైతును ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సిపిఐ నాయకులు

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మండలం వై. రాంపురం గ్రామానికి చెందిన శివకుమార్ అనే రైతుకి చెందిన అరటి తోట సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చేతికొచ్చిన ఆరు లక్షల రూపాయల పంటను నష్టపోవడం జరిగిందని నష్టపోయిన రైతును ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సిపిఐ పార్టీ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రమాదంలో దగ్ధమైన అరటి తోటను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనుకున్న రెండు ఎకరాలలో పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెట్టి అరటి పంట సాగు చేశాడని చేతికి వచ్చిన సమయంలో ప్రమాదం జరిగి పంట మొత్తం దగ్ధమైందని వారు పేర్కొన్నారు ప్రమాద స్థలాన్ని అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతుకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుకు సానుకూలంగా ప్రభుత్వం న్యాయం చేయకపోతే సిపిఐ పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ నియోజకవర్గం సిపిఐ పార్టీ నాయకులు సుల్తాన్, రైతు సంఘం నాయకులు గోపాల్, నాగరాజు, రైతు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img