Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

50 కోట్లకి చేరిన కొవిడ్‌-19 పరీక్షలు

దేశమంతటా టెస్టింగ్‌ సదుపాయాలు, మౌలిక వసతులను పెంచడం ద్వారా ఐసీఎంఆర్‌ 50 కోట్ల మైలురాయిని వేగంగా చేరుకోగలిగిందని ఐసీఎంఆర్‌ గురువారం వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 50 కోట్ల నమూనాలను పరీక్షించారని పేర్కొంది. భారత్‌ చివరి పది కోట్ల పరీక్షలను కేవలం 55 రోజుల్లోనే చేపట్టి ఈనెల 18న 50 కోట్ల పరీక్షల మార్క్‌ను చేరుకుందని తెలిపింది. అధిక పాజిటివిటీ రేటు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్‌-19 నమూనాల మాస్‌ టెస్టింగ్‌ చేపట్టినట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ బలరాం భార్గవ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img