Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఉద్యమ స్ఫూర్తి కారుడు దాచూరి రామిరెడ్డి

శెట్టిపి జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : అమరజీవి దాచూరి రామిరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి లాంటిదని యుటిఎఫ్ నాయకులు శెట్టి పి జయ చంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం యూటీఎఫ్ కార్యాలయంలో అమరజీవి దాచూరి రామిరెడ్డి ఏడవ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఉపాధ్యాయులు సమాజంలో తలెత్తుకొని బ్రతుకుతున్నారంటే ఆయన పోరాటమే నని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యమాన్ని రాష్ట్రంలోనే కాకుండా, కలిసి వచ్చే ఇతర రాష్ట్రాలలోనూ నిర్మించారని, ఎస్టీఎఫ్ఐ ను స్థాపించి, ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, ఉపాధ్యాయ వృత్తి తో పాటు వైద్య వృత్తి కూడా నేర్చుకుని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసి, ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. వారి క్రమశిక్షణ ఆయన నుంచి నేర్చుకున్నదేనని యుటిఎఫ్ ఆర్థిక క్రమశిక్షణ సమయపాలన ఆయనకవే ఆభరణాలన్నీ తెలిపారు. ఈనాడు ఉపాధ్యాయులు-నాడు బతకలేని బడిపంతులు నుండి నేడు బ్రతక నేర్చిన బడిపంతులు వరకు తీసుకొని రావడానికి, రీ గ్రూపింగ్ స్కేల్స్ వలనే నని, ప్రభుత్వంతో నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు నిర్మించి పాలకుల చేత ఫలితాలను సాధించి అందరికీ దిక్సూచిగా నిలవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, రామకృష్ణ నాయక్,రాంప్రసాద్, గోపాల్ రెడ్డి, హెచ్. రామాంజనేయులు నాగేశ్వర్ రెడ్డి వి .రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img