Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కుప్ప‌కూలిన బ‌హుదాన‌ది బ్రిడ్జి.. త‌ప్పిన ముప్పు

  • ఇఛ్చాపురం స‌మీపంలోని బ‌హుదాన‌ది బ్రిడ్జి ఒక్క‌సారిగా విరిగిప‌డింది. కాగా ఇది శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి. ఇచ్ఛాపురం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. నేడు 70 టన్నుల బరువున్న రాళ్ళ లారీ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. బ్రిడ్జి ఒక్కసారిగా కూలడంతో లారీ కింద పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 1929లో బ్రిటీస్ కాలంలో ఈ బ్రిడ్జిని నిర్మించారు. వంతెన కూలిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ వంతెనపై ఈ మధ్యే కొత్త రోడ్డు కూడా వేశారు. చూసేందుకు బాగానే కనిపించినా గ్రానైట్ లోడ్‌ లారీ బరువును తట్టుకోలేక కూలిపోయింది. సామర్థ్యానికి మించిన లోడుతో వెళ్లడంతో పాటు పాతకాలం నాటి బ్రిడ్జి కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. బ్రిడ్జికి నదికి మధ్య 20 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. ప్రమాద సమయంలో బ్రిడ్జి ఇతర వాహనాలేవైనా ఉంటే ప్రమాద తీవ్రత పెరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img