Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవ వేడుకలు

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా ఏడవ రోజు బుధవారం సాయంత్రం బ్రహ్మ రథోత్సవం, దూలో దూలోచవము (గజ వాహనం) లు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆలయ ఈవో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మ రథోత్సవాన్ని బుధవారం సాయంత్రం అంజుమాని సర్కిల్ వరకు రతాన్ని లాగి తిరిగి యధా స్థానానికి భక్తాదులు చేర్చారు. ఈ రథోత్సవాన్ని లాగడానికి వందలాదిమంది ప్రజలు రతాన్ని లాగుతూ గోవింద నామ స్మరణతో పట్టణం మారుమోగింది. ఉభయ దాతలుగా పెనుజూరు అశ్వత్త నారాయణ అండ్ సన్స్, కార్తికేయ, బలరాం, రవితేజ, కృష్ణమూర్తి, డాక్టర్ సుమంత్, సాయి రంగా, కీర్తిశేషులు పెనుజురి వెంకటాచలపతి, ప్రసాద్, కీర్తిశేషులు పెనుజురి తిరుపాలయ్య శెట్టి భార్య భాగ్య రంగమ్మ, కలవల పెద్ద నారాయణ శెట్టి అండ్ సన్స్, కీర్తిశేషులు రామసుబ్బయ్య సన్స్, కీర్తిశేషులు కలవల గోపాల శెట్టి అండ్ సన్స్, కెవి చల పతి అండ్ సన్స్, ముకుంద అండ్ సన్స్, దివాకర్ అండ్ సన్స్, ప్రకాష్ అండ్ సన్స్ వ్యవహరించారు. అనంతరం రాత్రి దూలొస్తవం (గజ వాహనం) ద్వారా పట్టణ పురవీధులలో చెన్నకేశవ స్వామి ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ ఉభయ దాతలు, ఉపాధ్యక్షులు కుండా చౌడయ్య ఆలయ డైరెక్టర్లు, వేల సంఖ్యలో భక్తాదులు పాల్గొని పునీతులయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img