Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో చీలిక..?

ఖాట్మండు : నేపాల్‌లో అతిపెద్దనైన కమ్యూనిస్టు పార్టీ సీపీఎస్‌యుఎమ్‌ఎల్‌ అధికారికంగా చీలిపో యింది. పార్టీ నాయకుడు మాధవ్‌కుమార్‌ నేతృత్వంలోని ఒక వర్గం నేపాల్‌లో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నూత నంగా ఏర్పడే పార్టీ పేరు సీపీఎన్‌యుఎమ్‌ఎల్‌ (సోషలిస్టు) కోసం దరఖాస్తును పెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు విడిపోయే విధాదాన్ని సరళంచేసేందుకు రాజకీయ పార్టీల చట్టం 2017ను సవరించేం దుకు మంత్రి మండలి సిఫారసుపై, అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం, 20శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది పార్లమెంటరీ పార్టీ సభ్యులు ఉంటే రాజకీయపార్టీని చీల్చే హక్కు ఉంది. ఈ సవరణకు ముందు రాజకీయపార్టీ చట్టంలోని నిబంధనల ప్రకారం అసమ్మతి వాదులు పార్లమెం టరీ పార్టీలో 40శాతం సభ్యుల మద్దతు పొందవలసి ఉంది. షేర్‌ బహదూర్‌ దేవుబా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌ కనీసం రెండు పార్టీలలో చీలికలకు దారితీసింది. ఇది అత్యంత అరుదైన సంఘటనగా పరిశీలకులు వెల్లడిరచారు. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్న సీపీఎన్‌యుఎమ్‌ఎల్‌ వర్గానికి చెందిన మాధవ్‌కుమార్‌ నేపాల్‌జలనాథ్‌ ఖనల్‌ వర్గానికి ఈ ఆర్డినెన్స్‌ ఉపయోగ పడుతుంది. నేపాల్‌లో కొత్త పార్టీని నమోదు చేయడం ద్వారా యుఎమ్‌ఎల్‌కి దీర్ఘకాలంగా మాజీ ప్రధాని ఓలికి ఉన్న వైరం ముగిసే అవకాశం ఉంది. ఈ నూతన ఆర్డినెన్స్‌ మహంత ఠాకూర్‌ నేతృత్వంనోని జనతా సమాజ్‌వాద్‌పార్టీ (జేఎన్‌పీ) కొత్త పార్టీ కోసం నమోదు చేసుకోనున్నారు. కొత్త పార్టీ పేరు సమాజ్‌వాదీ పార్టీ నేపాల్‌ (డెమొక్రాటిక్‌), కీలకమైన మాదేసి పార్టీ కూడా అధికారికంగా రెండుగా విడిపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img