Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యుత్ చార్జీల పెంపును విరమించుకోవాలి

విశాలాంధ్ర-రాప్తాడు : కోతల్లేని విద్యుత్తును సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అనధికార విద్యుత్ కోతలు విధించడం దారుణమని టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలలోని హంపాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోతలు లేని కరెంటు ఇస్తున్నట్లు జగన్ ప్రభుత్వం లేని గొప్పలు చెప్పుకుంటోందని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యం పెంచి మిగులు విద్యుత్తు ఉంచారన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు 7 సార్లు ప్రజలపై విద్యుత్ చార్జీలు పెంచి రూ.37000 కోట్ల అదనపు భారం వేశారని విమర్శించారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని ప్రణాళిక సిద్ధం చేశారని, రైతులు మోటార్లకు మీటర్లు బిగించడానికి వస్తే మీటర్లు ధ్వంసం చేయాలని, దానికి టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని, అనధికార విద్యుత్ కోతలను ఆపి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులకు అనేక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా ఆగిపోయిందని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నారాయణస్వామి, గంగలకుంట రమణ, కిష్ట, ఎంపీటీసీలు జాఫర్ ఖాన్, రవి, నాయకులు మరూరు గోపాల్, వెంకటరాముడు, ఇంద్ర, కేశవ, బోగినేపల్లి రమేష్, ఉజ్జినేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img