Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

పట్టణ మౌలిక సమస్యలు తీర్చండి

పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు నిరసన..

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో అనేక సంవత్సరాలుగా ధర్మవరం గేటు కసాపురం బ్రిడ్జి ప్లే ఓవర్ ,అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామని అనేక ప్రభుత్వాలు హామీలతోనే సరిపోయిందని చేసింది ఏమీ లేదని సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశం సందర్భంగా పట్టణ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ మౌలిక సమస్యలపై నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో మెయిన్ రోడ్డు మొత్తం 60 అడుగుల రోడ్డుగా వెడల్పు చేయాలని అన్నారు. మెయిన్ రోడ్డు ఇరుపక్కల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మెయిన్ రోడ్లమీదగా మరుగుదొడ్లు ,మూత్ర విసర్జన లు ఏర్పాటు చేయాలని అన్నారు.కసాపురం రైల్వే బ్రిడ్జిపై ప్లే ఓవర్ బ్రిడ్జి గా ఏర్పాటు చేయాలన్నారు. ధర్మవరం గేట్ దగ్గర భూగర్భ రహదారిని ఏర్పాటు చేయాలన్నారు. కసాపురం రోడ్డు వీధులు మాదిరిగా గుత్తి, ఆలూరు, బళ్లారి ,ఉరవకొండ రోడ్లను వెడల్పు చేసి డివైడర్లను నిర్మించి సుందరంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,సిఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, ఏఐటియు సి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్ ,ఏపీ మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి రామాంజనేయమ్మ, సిపిఐ నాయకులు మల్లయ్య, దౌల, బాబా ఫక్రుద్దీన్, చిదంబరం, ఏఐవైఎఫ్ నాయకులు వంశీకృష్ణ ,నందు, ఏఐఎస్ఎఫ్ నియోజవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్, ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ కుమార్, అఖిల్,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img