Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ప్రైవేట్ పాఠశాలల వలలో తల్లిదండ్రులు..

నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలుకు వెనకడుగు : ఏఐఎస్ఎఫ్
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో టెక్నో, ఈ- టెక్నో, ఎన్ ఆర్ సి, ఐకాన్, ఒలింపియాడ్ కోర్సులతో ఆంగ్ల బోధన, మానసిక వికాసం, యోగ, క్రీడలు, సిమ్మింగ్, మేదోసంపత్తిపై నిరంతర సమీక్ష ఇలా మరెన్నో విద్య బోధనలను అందిస్తామని చెబుతూ..ఫీజులు దోచుకుంటూ.. ప్రైవేట్ పాఠశాలల వలలో తల్లిదండ్రులను చిక్కుకొని కన్నీరు పెడుతున్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని అశోక్ నగర్ లో ఉన్న ట్రైలిస్ పాఠశాల లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్స్ చేస్తున్న పేపర్స్ ను తీసుకుని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుళ్లాయ స్వామి, కార్యదర్శి చిరంజీవి డీఈవో సాయిరాం ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ డిఇఓ పద్మప్రియ కు అప్లికేషన్ పత్రాలను అందజేశారు. నిబంధనలు ఉలన్గించే ఏ పాఠశాల పైన చర్యలు తీసుకుంటాం అంటున్న డీఈఓ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ఏ ఎస్ ఎఫ్ డిఈ ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. విద్య హక్కు చట్టాన్ని అమలు చేయకుండా, ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి రమణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమామహేష్, సహాయ కార్యదర్శి ఆనంద్ వంశీ, జగదీష్, ఉదయ్ రఘు, మధు పాల్గొన్నారు.
01.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img