Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇండియా బాలికల బాస్కెట్బాల్ కు కిరణ్మయి ఎంపిక..

విశాలాంధ్ర -ధర్మవరం : అండర్-16 బాలికల బాస్కెట్బాల్ ఇండియా క్యాంపుకు ధర్మవరం పట్టణానికి చెందిన కిరణ్మయి అనే బాలిక ఎంపిక కావడం, ధర్మవరం బాస్కెట్బాల్ చరిత్రలోనే ఇది మొదటిసారి అని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల మధ్య అంతర్జాతీయ స్థాయిలో అండర్ -,16 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జూన్ 10వ తేదీ నుండి జోర్డాన్ దేశంలోని అమ్మన్ ప్రదేశంలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ అంతర్జాతీయ పోటీలకు ఇండియా తరఫున పాల్గొనే జట్టును మే 31 నుండి జూన్ 6 మధ్య చతిస్గడ్ రాష్ట్రంలోని రాజానందా గౌడ్ నగరంలో ఎంపిక జరుగుతుందని తెలిపారు. దీనికోసం ఇండియన్ ప్రబబుల్స్ టీం ఎంపిక చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే ఇండియా క్యాంపుకు ఎంపికైన కిరణ్మయి గతంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన టోర్నమెంటులో ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించి, అత్యంత ప్రతిభ కనబరిచిన కిరణ్మయి ఉమ్మడి జిల్లా తరఫున ఒక్కరే ఇండియా క్యాంపుకు ఎంపిక అయిందని వారు తెలిపారు. బాలిక ఎంపిక పట్ల జయ చంద్ర రెడ్డి తో పాటు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదాయత్తుల్ల, కోచ్ సంజయ్, ఆత్మీయ ట్రస్టు వైస్ చైర్మన్ సూర్య ప్రకాష్ తదితరులు అభినందన శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి ఆత్మీయ ట్రస్టు కిరణ్మయి ప్రతిభకు ప్రోత్సాహకంగా ఐదువేల రూపాయలను బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు రామిరెడ్డి చేతులు మీదుగా, ట్రస్ట్ వైస్ చైర్మన్ సూర్య ప్రకాష్ అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img