Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

విద్యుత్ చార్జీల పెంపుదల సామాన్య, మధ్యతరగతులకు పెనుభారం..

టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య
విశాలాంధ్ర- ధర్మవరం : విద్యుత్ చార్జీల పెంపుదల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు పెనుబారం అయిందని, వైసిపి అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలను 9సార్లు ప్రజలపై మోపడం దారుణమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అదనపు చార్జీల పేరుతో వైసిపి ప్రభుత్వం వసూళ్లకు పాల్పడడం దారుణమన్నారు. అంతేకాకుండా ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఆర్థిక సంస్కరణలను అమలుపరిచే ప్రక్రియలో భాగంగా అప్పులు తెచ్చుకునేందుకు, ప్రపంచ బ్యాంకుతోపాటు కేంద్ర ప్రభుత్వానికి బానిసగా తయారైందని వారు మండిపడ్డారు. దీంతోపాటు తగుదు నమ్మ అంటూ… ప్రజలపై వివిధ రకాల పన్నుల రూపేనా చార్జీల రూపేనా మోయలేని భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. గత టిడిపి హయాములో ఉన్న ఐదేళ్లలో కరెంటు చార్జీలు పెంచలేదని, నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన ప్రతి ఏడాది 15 శాతము ఇంటి పన్ను పెంపు, దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్త పన్ను విధించడం జరిగిందన్నారు. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు పెంచి, సామాన్య ప్రజలు మోయలేని భారం మోపుతూ వారి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే టిడిపి ఆధ్వర్యంలో ప్రజలతో మమేకమై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో టిడిపి నాయకులు కాచర్ల కంచన్న ,మేకల రామాంజనేయులు, రాళ్లపల్లి షరీఫ్, నాగూర్ హుస్సేన్, కేశగాళ్ల శ్రీనివాసులు, అంబటి సనత్,మారుతి స్వామి, కృష్ణాపురం జమీర్ అహ్మద్, చట్టా లక్ష్మీనారాయణ, అత్తర్ రహీం భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img