Friday, April 26, 2024
Friday, April 26, 2024

శాశ్వత కరువు నుంచి అనంత జిల్లాకు విముక్తి కలిగించాలి

ప్రముఖ న్యాయవాది ఐ. రవీంద్రనాథ్

విశాలాంధ్ర- ఉరవకొండ : నిత్యం కరువు కాటుకాలకు గురవుతున్న అనంతపురం జిల్లాను శాశ్వత కరువు నుంచి విముక్తి కలిగించేందుకు పాలకులు కృషి చెయ్యాలని అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ఐదు కల్లు సదాశివన్ కుమారుడు ప్రముఖ న్యాయవాది ఐదుక ల్లు రవీంద్రనాథ్ అన్నారు. సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రైతు గర్జన ప్రచార జాత కార్యక్రమాన్ని శనివారం ఉరవకొండలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య తో కలిసి ఐ. రవీంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా నిత్యం అన్యాయానికి గురవుతుందన్నారు. జిల్లాలో 25 లక్షల ఎకరాలు సాగు భూమి ఉందని అయితే కేవలం లక్ష ఎకరాకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు అత్యధిక శాతం వర్షం పై ఆధారపడి రైతులు వ్యవసాయాన్ని సాగు చేసుకుంటున్నారని నిత్యం కరువు వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని తెలిపారు. పాలకులు మారుతున్నప్పటికీ జిల్లా రైతులు పరిస్థితులలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. హెచ్ ఎల్ సి కాల్వకు 32 టీఎంసీలు నీరు రావాల్సి ఉండగా అది ప్రస్తుతం 19.5 టీఎంసీలకు పడిపోయిందన్నారు హంద్రీనీవా ద్వారా జిల్లాలో దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కాలువ పనులు పూర్తి కాకపోవడంతో సాగునీటిని అందించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టుల వల్ల అనంతపురం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. గత 70 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా ప్రజల కోసం వారి హక్కుల కోసం వామపక్ష పార్టీలు అలుపెరగని ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారన్నారు ఇప్పటికైనా అనంతపురం జిల్లా ప్రజల రైతుల పట్ల ప్రభుత్వాలు స్పందించాలన్నారు రైతులకు ఉచితంగా ఎరువులు విత్తనాలు అందించాలని విరివిగా పంట రుణాలు ఇవ్వాలని పంట రుణాలు మాఫీ చేయాలని హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీలు నీటిని జిల్లాకు కేటాయించాలని సమంత కాలువ ఏర్పాటు చేయాలని దీంతోపాటు వాటర్ గ్రిడ్జ్ ఏర్పాటు చేసి చెరువులకు నీరు అందించాలన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న పోరాటానికి ప్రజలు రైతులందరూ కూడా సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలపాలన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img