Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కేకేఈ మాజీ ఎంపీ స్కైలాకోస్‌ మృతి

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ (కేకేఈ) దీర్ఘకాలిక సభ్యుడు, మాజీ ఎంపీ ఆంటోనిస్‌ స్కైలాకోస్‌ (72) గుండె పోటుతో మరణించారు. 1949లో లారిస్సాలో జన్మించిన స్కైలాకోస్‌ ఏథెన్స్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. నియంతృత్వ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1974లో కమ్యూనిస్టు యూత్‌లో చేరారు. 1975లో కేకేఈ సభ్యుడయ్యాడు. ఆయన 1982 నుంచి 2009 వరకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆంటోనిస్‌ స్కైలాకోస్‌ 1989, 1993లో గ్రీస్‌లోని లారిసా నియోజకవర్గం తరఫు నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2000 నుంచి 2004 వరకు ఆయన్‌ ఏథెన్స్‌ బి నియోజకవర్గం తరఫున మళ్లీ ఎన్నికయ్యారు. 2007 నుంచి 2013 వరకు లారిసాకు ప్రాతినిధ్యం వహిస్తూ తిరగి డిప్యూటీగా పనిచేశారు. కేకేఈ సెంట్రల్‌ కమిటీ కామ్రేడ్‌ స్కైలాకోస్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన మరణానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన లక్ష్యాలు, విలువలను నిస్వార్ధ పనితీరుకు కేకేఈ జేజేలు పలికింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img