Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంజ్‌షిర్‌పై యుద్ధమేఘాలు

భారీగా తరలిన తాలిబన్లు
ప్రతిఘటనకు సై అన్న స్థానికులు

కాబూల్‌ : తాలిబన్లను చూసి ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలంతా భయపడుతున్నా… పంజ్‌షిర్‌ లోయలో మాత్రం స్థానికులు వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. రోజురోజుకూ అక్కడ తాలిబన్లకు వ్యతిరేకత పెరిగిపోతోంది. దీంతో తమకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుందేమో అని తాలిబన్లు అప్రమత్తమ య్యారు. పంజ్‌షిర్‌ లోయకు తమ సైన్యాన్ని భారీగా పంపారు. లోయలో ప్రజలను ముందుండి నడిపిస్తున్న నేషనల్‌ రెసిస్టాన్స్‌ ఫ్రంట్‌ చీఫ్‌ అహ్మద్‌ మస్సూద్‌ మాత్రం తాలిబన్లతో చర్చలు జరుపుతామని అన్నారు. అయితే చర్చలు కాదు యుద్ధం జరిగే పరిస్థి తులు కనిపిస్తున్నాయి. పంజ్‌షిర్‌ మినహా అఫ్గాన్‌ మొత్తం తాలిబన్ల వశమైన నేప థ్యంలో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు చేస్తున్న యత్నాలను అక్కడి తిరుగుబాటుదారులు అడ్డుకుంటున్నారు. తాజాగా, 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్‌ సైన్యం ప్రకటించిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, పంజ్‌షీర్‌ లోయ ప్రజలు అన్ని మార్గాలను దిగ్బంధించి, గట్టి పహారా నిర్వహిస్తున్నారు. తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మరోవైపు, పంజ్‌షీర్‌కు వందలాది వాహానాల్లో భారీ ఆయుధాలతో తాలిబన్లు బయల్దేరి వెళ్లారు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కబ్జా చేసుకోవాలని కృతనిశ్చ యంతో ఉన్నారు. దీంతో అక్కడ యుద్ధమే ఘాలు కమ్మేశాయి. పంజిషిర్‌ లోయకు సమీ పంలోని మూడు జిల్లాలను అఫ్గాన్‌ సైన్యం, ఇతర మిలీషియా గ్రూప్‌లు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి జనరల్‌ బిస్మిల్లాప్‌ా మహ్మద్‌ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. పంజిషీర్‌కు ఉత్తరాన బఘలాన్‌ ప్రావిన్సుల్లోని దేప్‌ా సలేప్‌ా, బనో, పల్‌-హేసర్‌ జిల్లాలలో తాలిబన్‌లను ప్రతి ఘటించి అక్కడ నుంచి వెళ్లగొట్టినట్లు పేర్కొ న్నారు. ఇదిలావుంటే, అఫ్గాన్‌ రెజిస్టెన్స్‌ దళాధిపతి అహ్మద్‌ మసూద్‌ నేతృత్వంలో పంజ్‌షిర్‌ ప్రావిన్స్‌ సమీప ప్రాంతాల్లో తాలిబన్లపై పోరాటం జరుగుతోంది. తన ఆధీనంలోని ప్రాంతాలను తాలిబన్లకు అప్పగించి వారికి లొంగిపోవడానికి మసూద్‌ నిరాకరించారు. తుదిశ్వాస వరకు పోరాడతామని.. లొంగిపో మని తేల్చిచెప్పారు. లోయను స్వాధీనం చేసుకోవడానికి జరిగే యత్నాలను ప్రతిఘటిస్తామని తాలిబన్లను హెచ్చరిం చాడు. మసూద్‌ తండ్రి ముజాహిదీన్‌ కమాండర్‌ అహ్మద్‌ షా మసూద్‌ని తాలిబన్లు 2001 సెప్టెంబరు 11న కాల్చి చంపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img